వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం పల్లెపాలెంలో మత్స్యకారులు వలలు భద్రపరిచే షెల్టర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది మత్స్యకారులకు చెందిన రూ.3 కోట్ల విలువైన చేపల వలలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, జీవనాధారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత మత్స్యకారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

