వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సోమవారం ఖమ్మంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కొత్తగూడెంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని పునర్నిర్మించి అందుబాటులోకి తేవాలని, పాల్వంచ శ్రీనివాస కాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

