Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఎదురుచూపులు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:32 PM మెదక్General
కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఎదురుచూపులు - Udayam
నిజాంపేట మండలంలో మొక్కజొన్న నూర్పిడి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పంటను కోసి నూర్పిడి చేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను ఆరబెట్టేందుకు రోడ్లపైనే ధాన్యం పోస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...