వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కంప్యూటర్ షాపు ముసుగులో నిర్వహిస్తున్న డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. సోదాల్లో 148 కిలోల అల్ప్రజోలం ఇంటర్మీడియట్ పదార్థం, 1,046 కిలోల ముడిసరుకులు, 188 లీటర్ల రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ తయారీ యంత్రాలను సీజ్ చేసి, ప్రధాన నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

