వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో మహిళపై కత్తితో హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గతంలో పరిచయం ఉన్న మహిళ తనను దూరం పెట్టిందనే కక్షతో ఓ వ్యక్తి ఆమె ఇంటి వద్దకు వెళ్లి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

