Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుషిత ఆహారం 100 మందికి అస్వస్థత

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:46 PM గుంటూరువినోదం
కలుషిత ఆహారం 100 మందికి అస్వస్థత - Udayam
తెనాలిలో ఆదివారం మతపరమైన కార్యక్రమంలో కలకలం రేగింది. వేడుకల్లో భాగంగా గోశాలకు వెళ్లి వచ్చిన తర్వాత పలువురు భోజనం చేశారు. అనంతరం 100 మందికిపైగా వాంతులు, అస్వస్థతతో ఇబ్బందిపడ్డారు. పాలతో తయారు చేసిన తీపి పదార్థం కలుషితం కావడమే కారణమని అనుమానిస్తున్నారు. బాధితులను కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...