వార్తలకు తిరిగి వెళ్లండి
కళ్యాణలక్ష్మిపథకం పంచనామా కోసం దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

దోమ మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోత్కూర్ గ్రామానికి చెందిన GPO జగదీశ్ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు కోసం ₹20,000 లంచం డిమాండ్ చేసి, ముందుగా ₹6,000 ఇవ్వాలని కోరినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ACB అధికారులు సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ పథకాలకు కూడా లంచాలు అడుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...