వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలగణపురం మండలం కళ్లెంలోని మల్లుకుంటకు అశ్వరావుపల్లి ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో చెరువు నిండిపోయి అలుగు పారుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో నీరు రావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.
సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి ఆధ్వర్యంలో గ్రామస్థులు చెరువు వద్ద సంబరాలు నిర్వహించారు. భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోయే దశలో చెరువు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

