వార్తలకు తిరిగి వెళ్లండి

కడప నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో నగర పాలకసంస్థ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. సంజన్న కూడలి వద్ద నిర్మించిన మరుగుదొడ్లు చాలాకాలంగా వినియోగానికి నోచుకోవడం లేదు.
ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

