Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్లుగా ప్రతిరోజూ జనగణమన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 11:21 AM కరీంనగర్తెలంగాణ
ఐదేళ్లుగా ప్రతిరోజూ జనగణమన - Udayam
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు మైకులో జనగణమన ఆలపిస్తారు. గ్రామస్తులు ఎక్కడివారక్కడే ఆగి జాతీయగీతాన్ని ఆలపిస్తారు. అశోక్ ఆదిత్య యూత్ క్లబ్ వ్యవస్థాపకుడు జన్నారపు శ్రీనివాస్‌తో పాటు యువకుల ఆలోచనతో 2022 ఆగస్టు 13న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేటితో నిత్య జాతీయగీతాలాపనకు ఐదేళ్లు పూర్తయ్యాయి.

Comments

G
Loading comments...