Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ఆవేదన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 6:27 PM జనగామ General
ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ఆవేదన - Udayam
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం ఇచ్చారని వెంకటమ్మ, వెంకటయ్య దంపతులు తెలిపారు. పత్రం నమ్మి ఉన్న చిన్న పెంకుటిల్లును కూల్చివేయగా, ఇప్పుడు ఇల్లు మంజూరు కాలేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూల్చివేయడంతో తాము రోడ్డున పడ్డామని వృద్ధ దంపతులు తెలిపారు. మంజూరు పత్రాన్ని చూపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...