వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆసుపత్రుల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యం పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.
Comments
Loading comments...

