Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసులపల్లిలో చెరువు నుంచి వ్యర్థాల తొలగింపు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:49 AM పెద్దపల్లి General
కాసులపల్లిలో చెరువు నుంచి వ్యర్థాల తొలగింపు - Udayam
పెద్దపల్లి మండలం కాసులపల్లిలో సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి చెరువును శుభ్రం చేస్తున్నారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా పేరుకుపోయిన వ్యర్థాలను గ్రామ సర్పంచ్ గద్దల రాజశేఖర్ మంగళవారం జేసీబీ సహాయంతో తొలగించారు. బతుకమ్మ నిమజ్జనానికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. పండుగకు ముందే పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...