వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో చింతలపూడి కాలువ గట్టును కొందరు అక్రమంగా తవ్వుకుపోతున్నారని రైతులు ఆరోపించారు. రాత్రివేళ జేసీబీలు తీసుకొచ్చి లారీల్లో మట్టిని తరలిస్తున్నారని తెలిపారు.
కొద్దిరోజులుగా చీకటి మాటున తవ్వకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గట్టు బలహీనపడితే భవిష్యత్తులో గండ్లు పడి పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

