వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలోని పురాతన జ్యోతి సిద్ధవటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరింది. క్రీ.శ. 7-8వ శతాబ్దాల నాటి ఈ ఆలయంలోని పలు కట్టడాలు, గోపురాలు దెబ్బతిన్నాయి.
శ్రీశైల దేవస్థానం అధికారులు గతంలో జీర్ణోద్ధరణకు ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఆలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.
Comments
Loading comments...

