Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో ఘనంగా పోచమ్మ బోనాలు

Follow Udayam on Google
p.g.murthy Aug 09, 2026 12:44 PM మంచిర్యాలGeneral
జన్నారంలో ఘనంగా పోచమ్మ బోనాలు - Udayam
జన్నారం పట్టణంలోని వివిధ కాలనీలలో ఉన్న ప్రజలు, భక్తులు పోచమ్మ అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా ఆదివారం రాంనగర్, వినాయక్ నగర్, పాత పోన్కల్, బస్ స్టాండ్ ఏరియా ప్రాంతాలలోని వివిధ కాలనీల ప్రజలు, మహిళలు ఇళ్ల వద్ద బోనాలను తయారు చేసుకుని పోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Comments

G
Loading comments...