వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి పెంబర్తి బైపాస్ రోడ్డుకు వెళ్లే 60 అడుగుల రోడ్డులో మురుగు కాలువ గుంత ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు లేక వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ గుంత కారణంగా గతంలో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

