Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఆలయాల్లో చండీ దేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:23 PM జనగామ General
జనగామ ఆలయాల్లో చండీ దేవిగా అమ్మవారి దర్శనం - Udayam
జనగామ పట్టణంలోని అంబబావి ఉప్పలమ్మ, బతుకమ్మ కుంట విజయదుర్గ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారు చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అంబబావి ఆలయ ప్రధాన అర్చకుడు పవన్‌ శర్మ తెలిపారు. ప్రతిరోజూ రాత్రి ఉత్సవమూర్తి ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...