వార్తలకు తిరిగి వెళ్లండి

జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్టు చేసామని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన గడ్డి చంద్రశేఖర్, ఎరుకల అరుణ్ కలిసి ఇంటి ఆవరణలో నిలిపే ఆటోలలో ఉండే బ్యాటరీలను దొంగతనం చేస్తున్నారన్నారు.
ఆటో డ్రైవర్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి చంద్రశేఖర్ ను అరెస్టు చేయగా, అరుణ్ పరారీలో ఉన్నాడన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
Comments
Loading comments...

