వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల నార్త్, సౌత్ క్యాంపస్‌లలో ప్రారంభం కానుంది. అత్యల్పంగా 2,489 ఓట్లు పోలైన 105వ వార్డు ఫలితం తొలుత వెలువడనుంది.
అత్యధికంగా ఓట్లు పోలైన 6, 7వ వార్డుల ఫలితాలు చివరగా రానున్నాయి. మొత్తం 120 వార్డులకు 113 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అనంతరం మేయర్ ఫలితాన్ని ప్రకటించనున్నారు. అధికారులు ఇప్పటికే స్ట్రాంగ్ రూముల సీల్స్ తెరిచారు.
Comments
Loading comments...

