Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ కుటుంబానికి అండగా ఎన్‌ఆర్‌ఐ భోజేందర్‌రెడ్డి

Follow Udayam on Google
Udayam News Reporter Sep 17, 2026 4:21 PM జగిత్యాలGeneral
జగన్ కుటుంబానికి అండగా ఎన్‌ఆర్‌ఐ భోజేందర్‌రెడ్డి - Udayam
ఆర్థిక ఇబ్బందులతో సింహాచలం జగన్‌ అకాల మృతిచెందిన ఘటనపై గొల్లపల్లి మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎడమల భోజేందర్‌రెడ్డి మానవత్వంతో స్పందించారు. జగన్‌ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. భోజేందర్‌రెడ్డి తరఫున గురువారం కుటుంబ సభ్యులకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూత్‌ నాయకులు అవారి చందు, శంకర్రావు, మల్లారెడ్డి, హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...