వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెగడపల్లి మండలం దీకొండ గ్రామానికి చెందిన గంగాధర్ తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన ఆయన తాతను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

