వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ మండల కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న ప్రపంచ జానపద దినోత్సవ జాతర పోస్టర్‌ను ఎస్సై సోమవారం ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

