Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ తైక్వాండోకు గద్వాల విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:07 PM జోగులాంబ గద్వాల్ General
జాతీయ తైక్వాండోకు గద్వాల విద్యార్థుల ఎంపిక - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే జాతీయ తైక్వాండో టోర్నమెంట్‌కు ఎంపికైన గద్వాల జిల్లా విద్యార్థులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో అభినందించారు. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రాష్ట్రం, నియోజకవర్గం, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో కార్యదర్శి మాస్టర్‌ కే. శ్రీహరి, కోచ్‌ హరికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...