వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరు మండలంలో శుక్రవారం ఎరువుల క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రసాదరావు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నాణ్యత లోపాలు లేకుండా రైతులకు ఎరువులు విక్రయించాలని సూచించారు.
పలు రకాల ఎరువుల నమూనాలను సేకరించి రీజినల్ కోడింగ్ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. కల్తీ ఎరువులు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

