Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరానగర్‌లో డీఎల్‌పీవో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:41 PM హన్మకొండ General
ఇందిరానగర్‌లో డీఎల్‌పీవో ఆకస్మిక తనిఖీ - Udayam
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామాన్ని డీఎల్‌పీవో గంగా భవాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఫైల్స్, రిజిస్టర్లు, సిబ్బంది రోజువారీ హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ, వీఓ భవనాలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు శానిటేషన్, నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...