Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఇంటర్‌ ప్రవేశాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 11:39 AM ఖమ్మంGeneral
ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఇంటర్‌ ప్రవేశాలు - Udayam
జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయి. గత ఏడాది 2,862 మంది చేరగా, ఈ ఏడాది ఇప్పటివరకు 3,127 మంది ప్రవేశాలు పొందారు. ఆగస్టు 15 వరకు మరిన్ని ప్రవేశాలకు అవకాశం ఉంది. డిజిటల్‌ తరగతులు, అల్పాహారం, పుస్తకాల పంపిణీ, మౌలిక వసతుల కల్పన వంటి పథకాలు ప్రవేశాల పెరుగుదలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మూడు కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.

Comments

G
Loading comments...