వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి: పోలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ నెల 14న నిర్వహించనున్న కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఏఓ శ్రీకాంత్, క్లస్టర్ ఏఈఓలు కోరారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 13న జరగాల్సిన మేళాను వాయిదా వేసినట్లు తెలిపారు.
రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, లాభాలు సాధించే సాగు మెళకువలను నేర్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

