వార్తలకు తిరిగి వెళ్లండి

గిజిగాడు (బాయా వీవర్) పక్షి తన గూటిని అత్యంత కళాత్మకంగా అల్లుతుంది. మగ పక్షి నిర్మించిన గూడు నచ్చితేనే ఆడ పక్షి జతకట్టేందుకు ముందుకు వస్తుంది. ప్రత్యుత్పత్తి కాలంలో మగ పక్షులు ఆకర్షణీయంగా మారి, తాటి లేదా ఈత చెట్లపై వేలాడేలా సురక్షితమైన గూళ్లను నిర్మిస్తాయి.
పాములు, ఇతర శత్రువుల నుంచి రక్షణ పొందేలా నీటిపై వేలాడే కొమ్మలకే ఇవి ప్రాధాన్యతనిస్తాయి. గింజలు, కీటకాలు, చిన్న కప్పలను ఆహారంగా తీసుకునే ఈ పక్షి, జన్నారం అటవీ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కిన అద్భుత దృశ్యం.
Comments
Loading comments...

