Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకటనల ఆదాయానికి భారీ గండి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 12, 2026 7:09 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ప్రకటనల ఆదాయానికి భారీ గండి - Udayam
నగరంలో హోర్డింగ్‌లు, ప్రకటనల బోర్డులు భారీగా వెలుస్తున్నా నగరపాలికకు ఆశించిన ఆదాయం రావడం లేదు. వసూళ్ల బాధ్యతకు వేలం నిర్వహించకపోవడంతో అనుమతులు లేకుండానే పలుచోట్ల ప్రకటనలు కొనసాగుతున్నాయి. డివైడర్ల మధ్యనున్న 40 హోర్డింగ్‌లతోపాటు భవనాలపైనా ప్రకటనలు వెలుస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నగరపాలిక ప్రతి నెలా లక్షల రూపాయల ఆదాయం కోల్పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...