వార్తలకు తిరిగి వెళ్లండి
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్‌పేట్ చెరువులో గణేష్ నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిమజ్జనాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శనివారం సుమారు 40 భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

