వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మండలి విప్ అద్దంకి దయాకర్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
తనపై క్షుద్ర పూజలు చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రెండు ప్రైవేట్ కంప్లైంట్లు దాఖలు చేశారు. ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చినా క్షమాపణ చెప్పలేదని న్యాయవాదులు తెలిపారు. వీడియోలు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

