Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోదరుడి జ్ఞాపకంతో హెల్మెట్‌ పాఠం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 7:34 AM కాకినాడఆంధ్రప్రదేశ్
సోదరుడి జ్ఞాపకంతో హెల్మెట్‌ పాఠం - Udayam
ఎన్టీఆర్‌ జిల్లా జగన్నాథపురానికి చెందిన జానకిరాం ఈ నెల 7న కంచికచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలతో ఉండేవారని కుటుంబ సభ్యులు భావించారు. తమకు ఎదురైన విషాదం మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతో గ్రామ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని కుటుంబ సభ్యులు చైతన్యం కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...