Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి వెంకన్నకు స్వర్ణహారం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 8:16 AM కోనసీమGeneral
వాడపల్లి వెంకన్నకు స్వర్ణహారం - Udayam
కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామికి విశాఖపట్నానికి చెందిన తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు రూ.71,94,550 విలువైన 463.920 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని సోమవారం సమర్పించారు. ఆభరణాన్ని వెండిపళ్లెంలో ఊరేగింపుగా తీసుకొచ్చి దేవస్థానం అధికారుల సమక్షంలో అర్చకులకు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు లక్ష్మీహారాన్ని స్వామివారికి అలంకరించారు.

Comments

G
Loading comments...