Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఆర్సీ నియామకాల్లో హడావుడిపై అభ్యంతరం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:57 AM అమరావతిGeneral
హెచ్‌ఆర్సీ నియామకాల్లో హడావుడిపై అభ్యంతరం - Udayam
ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుండటంపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 24 గంటల ముందే సమాచారం ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు కనీస సమయం ఇవ్వకుండా హడావుడిగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...