Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరుకు భారీ వరద

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:01 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తాలిపేరుకు భారీ వరద - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. 8 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. డీఈ తిరుపతి, ఏఈ సంపత్‌ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పలు వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

Comments

G
Loading comments...