Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రివేళ అక్రమ కార్యకలాపాల కట్టడికి ‘ఆపరేషన్ కవచ్’

Follow Udayam on Google
Harika Oct 16, 2026 10:24 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో రాత్రివేళ అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. చార్మినార్ జోన్‌లోని 15 పోలీస్ స్టేషన్ పరిధుల్లో 500 మందికి పైగా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను పరిశీలించారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...