Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉపాధి హాజరు కోసం గడ్డం, మీసాల స్థానంలో దూది అతికింపు

Follow Udayam on Google
Rudhira Nov 18, 2026 10:50 AM ఆదిలాబాద్General
ఉపాధి హాజరు కోసం గడ్డం, మీసాల స్థానంలో దూది అతికింపు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం నారాయణ్‌పూర్‌లో వీబీ జీరాంజీ కూలీ జాదవ్‌ అంబాజీ ఆన్‌లైన్‌ హాజరు నమోదుకు ఇబ్బంది పడ్డారు. గతంలో గడ్డం, మీసాలు ఉన్న ఆయన ఇటీవల శుభకార్యం కోసం వాటిని తొలగించారు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో హాజరు నమోదు కాకపోవడంతో గడ్డం, మీసాల స్థానంలో దూది అతికించగా నమోదు పూర్తయింది.

Comments

G
Loading comments...