వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలోని హెచ్‌పీ గ్యాస్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎంటర్‌ప్రైజెస్‌పై వినియోగదారుడు భువనగిరి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. లీకేజీ ఉన్న సిలిండర్లను మార్చకుండా వినియోగించుకోవాలని సిబ్బంది చెబుతున్నారని అన్నారు.
డెలివరీ పేరుతో రూ.40 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని, ఆటోల్లో తూకం యంత్రాలు లేవని తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, అధికారులు స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

