Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ గురుకులాల పనివేళలపై వివరణ కోరిన హైకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:44 AM హైదరాబాద్General
బీసీ గురుకులాల పనివేళలపై వివరణ కోరిన హైకోర్టు - Udayam
తెలంగాణ బీసీ గురుకులాల పనివేళల మార్పు, ఉపాధ్యాయులకు బోధనేతర విధులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో 16 అమలు, పనివేళలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న పనివేళలను సవరించాలని, స్టడీ అవర్లు, హాస్టల్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

Comments

G
Loading comments...