Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు లాలుపురం వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 3:03 PM గుంటూరుGeneral
గుంటూరు లాలుపురం వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
గుంటూరు లాలుపురం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు తీవ్రంగా ఢీకొనడంతో ఒక లారీ క్లీనర్ తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, లారీ కేబిన్‌లో చిక్కుకున్న క్లీనర్‌ను బయటకు తీశారు. అనంతరం ప్రథమ చికిత్స నిమిత్తం అతడిని గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి (GGH) తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Comments

G
Loading comments...