వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం గుండాల తాండా గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పని చేస్తుండగా మంగ్యా నాయక్ తీవ్రమైన ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే అప్రమత్తమై ఆయనను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

