Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:16 PM ఆదిలాబాద్General
గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం - Udayam
గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని తెలంగాణ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గోలి శ్రీనివాసరెడ్డి సూచించారు. తలమడుగు మండలం ఖోడద్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని సభ్యుడు ఒరగంటి ఆనంద్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆహార భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించబోమని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మధ్యాహ్న భోజనంలోనూ ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...