Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో గ్రానైట్‌ రవాణా.. భద్రత ఏది?

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:49 AM బాపట్లGeneral
అద్దంకిలో గ్రానైట్‌ రవాణా.. భద్రత ఏది? - Udayam
అద్దంకి నామ్‌ రోడ్డుపై గ్రానైట్‌ రాళ్లను లారీల్లో ప్రమాదకరంగా రవాణా చేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి నిత్యం గ్రానైట్‌ లారీలు అద్దంకి మీదుగా వెళ్తున్నాయి. లారీలపై రాళ్లను భద్రపరిచేందుకు రక్షణ చర్యలు చేపట్టడం లేదని వాహనదారులు చెబుతున్నారు. రాళ్లు జారిపడితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...