Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలి

Follow Udayam on Google
Sandeep Oct 03, 2026 3:33 PM నిర్మల్General
గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలి - Udayam
గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించి, అర్హులైన ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి అధికారిక గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ దిలావర్‌పూర్ మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ నాయకులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేని చోట ప్రజలకు ప్రాథమిక చికిత్స అందిస్తూ సేవలందిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...