వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్లాంట్‌లో తనిఖీలు క్రమంగా జరిగాయని, ప్రమాద సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

