వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్ట బ్యారేజీ వద్ద వంశధార నది ప్రవాహం 27,400 క్యూసెక్కులకు చేరింది. బుధవారం 16,796 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం ఒక్కరోజులో దాదాపు 10 వేల క్యూసెక్కులు పెరిగింది. గురువారం నీటిమట్టం 37.30 మీటర్లుగా నమోదైంది.
బ్యారేజీ స్పిల్‌వేలో 19 గేట్లను ఎత్తి 26,071 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

