వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలంలో ఈ నెల 5న జరగనున్న ZPTC, MPTC ఎన్నికల్లో 57,553 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,948 మంది పురుషులు, 29,603 మంది మహిళలు ఉన్నారని రిటర్నింగ్ అధికారి నాగమహేశ్వరరావు తెలిపారు.
పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

