వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆర్థిక సాధికారత కోసం ఢిల్లీ ప్రభుత్వం 'లక్ష్మీ యోజన'ను ఆమోదించింది. సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే ఈ పథకానికి ఆమోదం తెలిపారు.
రూ.5,110 కోట్లతో రూపొందించిన ఈ పథకానికి ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 21-60 ఏళ్ల వయసుండి, వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న 17 లక్షలకు పైగా మహిళలకు ఇది లబ్ధి చేకూరుస్తుంది.
Comments
Loading comments...
