Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 01, 2026 9:45 PM విజయనగరంGeneral
గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం - Udayam
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నీటిమట్టం 54.3 అడుగులుగా ఉండగా, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి 13.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటవద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...